Indidan railway recruitment 2022: ఎగ్జామ్‌ లేకుండానే ఉద్యోగాలు!

-

Indidan railway recruitment 2022 :నిరుద్యోగులకు సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే శుభవార్త చెప్పింది. పలు గ్రూప్‌ సీ పోస్టలను భర్తీ చేయటానికి దరఖాస్తులు చేసుకోవాలని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే ప్రకటించింది( Indidan railway recruitment). విద్యార్హత, ఆసక్తి కలిగిన వారు, ఇండయన్‌ రైల్వేస్‌లో సర్వీస్‌ చేయాలనుకునేవారికి ఇదొక సువర్ణవకాశం. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అధికారిక వెబ్‌సైట్‌ ser.indianrailways.gov.in ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. మెుత్తం 21 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు వివరించారు. ఈ జాబ్‌కు ఎటువంటి పరీక్ష రాయనవసరం లేదనీ.. కేవలం ఈ రిక్రూట్‌మెంట్‌ స్పోర్ట్స్‌ కోటాలో జరగనుందని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 15 ప్రారంభం కాగా, చివరి తేదీ నవంబర్‌ 14 అని తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా, దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. రిక్రూట్‌మెంట్‌ కమిటీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారనీ.. క్రీడలు, విద్యా పరమైన సర్టిఫికేట్లు ధృవీకరణ తరువాత స్పోర్ట్స్‌ ట్రయల్స్‌లోని పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...