ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజుల(Inter Supplementary exam) చెల్లింపు గడువు పెంచింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో విధించిన గడువు ఇవాల్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు పెంచాలంటూ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్ధులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థన మేరకు పరీక్ష ఫీజు గడువు పొడిగించింది బోర్డు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజు రేపటి వరకు చెల్లించవచ్చు. కాగా జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంచిన ఇంటర్ బోర్డ్
-