Notification Release for staff nurse posts in Telangana: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 5,204 పోస్టులకు స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: 5,204 పోస్టులకు నోటిఫికేషన్
-