High Court Jobs: ఏపీ హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 3,673 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. జిల్లా కోర్టుల్లో 3,432 ఉద్యోగాలు, హైకోర్టుల్లో 241 పోస్టులతో మొత్తం 3,673 పోస్టులు ఉన్నాయి అయితే.. ఏపీ హైకోర్టు (High Court) ఈ పోస్టుల భర్తీకి వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.
నోటిఫికేషన్ల వారీగా పోస్టుల వివరాలు
మొత్తం పోస్టులు: 3673
సెక్షన్ ఆఫీసర్/కోర్ట్ ఆఫీసర్/స్ర్కూటినీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ – 9
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 13
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 – 114
ఓవర్సీస్ – 1
ఫీల్డ్ అసిస్టెంట్ – 158
ఎగ్జామినర్ – 112
కాపిస్ట్ – 209
రికార్డ్ అసిస్టెంట్ – 9
డ్రైవర్ (లైట్ వెహికల్)- 20
ప్రాసెస్ సర్వర్ – 439
ఆఫీస్ సబార్డినేట్ – 1520
టైపిస్ట్ అండ్ కాపిస్ట్ – 36
అసిస్టెంట్ ఎగ్జామినర్ – 27
అసిస్టెంట్ ఓవర్సిస్- 1
డ్రైవర్ – 8
ఆఫీస్ సబార్డినేట్ – 135
కంప్యూటర్ ఆపరేటర్ – 11
జూనియర్ అసిస్టెంట్ – 681
టైపిస్ట్ – 170
అర్హతలు: పోస్టులను అనుసరించి 7వ తరగతి, పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, టైప్ రైటింగ్/స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఖాళీలను అనుసరించి రూ. 20000 నుంచి రూ. 1, 24,380 మధ్య వేతనం ఉంటుంది. పోస్టులను అనుసరించి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. హైకోర్టుల పోస్టులకు అక్టోబర్ 25, 2022 నుంచి నవంబర్ 15, 2012 వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కోర్టు పోస్టులకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 11, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్ సైట్: https://hc.ap.nic.in