TCS: వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే!

-

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరిట దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే.. ఎంతోమంది ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచి ఆఫీసు వ్యవహారాలు చూసుకుంటున్నారు. కానీ ఇటీవల ఐటీ రంగాలు హైబ్రిడ్‌ విధానం మెుదలుపెట్టడంతో, కచ్చితంగా వారంలో మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని ఆయా కంపెనీలు తమ తమ ఉద్యోగులకు స్పష్టం చేశారు. అంతగాకుండా మూన్‌లైటింగ్‌ పద్ధతికి తమ కంపెనీ వ్యతిరేకమని తేల్చిచెప్పేశాయి. ఈ క్రమంలోనే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం ప్రముఖ ఐటీ కంపెనీ TCS కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త కండీషన్ల ప్రకారం, ఇకపై ఎవరైనా ఉద్యోగి వర్క్‌ ఫ్రమ్‌ హోం సౌలభ్యం పొందాలంటే.. మెడికల్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి అని చెప్పేసింది.

- Advertisement -

ఆఫీసుకు రిపోర్ట్‌ చేయాలని అడిగినప్పుడు ఆరోగ్యాన్ని సాకుగా చెప్పాలనుకుంటే… కచ్చితంగా తగిన మెడికల్‌ సర్టిఫికేట్‌ అవసరమని తేల్చిచెప్పింది. పైగా ఆరోగ్య సమస్యల కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ చేయాలనుకుంటున్న ఆశావహులు, తాము సెలక్‌ చేసిన డాక్టర్ల వద్దకే హెల్త్‌ చెకప్‌ కోసం పంపిస్తామని TCS ప్రకటించింది. ఇకపై వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనేది కేసు-టు-కేస్‌ ఆధారంగా అనుమతించనున్నట్లు సుస్పష్టం అవుతోంది. కంపెనీ సూచించిన వైద్యల బృందం నుంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తే.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ దుర్వినియోగం కాదని TCS అభిప్రాయపడుతోంది. అంతేగాకుండా ఉద్యోగుల పనితీరును కంపెనీ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూనే ఉంటుంది. వారంలో కనీసం మూడు రోజులైనా సరే ఆఫీసుకు వచ్చేలా చర్యలు తీసుకునేందుకు ఐటీ దిగ్గజం సన్నాహాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...