తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్(TET Notification)ను విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగష్టు 16 తేదీగా నిర్ణయించారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు.
బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్-2 పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న ఫలితాను ప్రకటించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
TET Notification | ఆన్లైన్ లో https://tstet.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దాదాపు 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షలో పోటీ పడే అవకాశముందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు.