TS Group 3 దరఖాస్తు గడువు ముగిసింది. 1375 గ్రూప్-3 సర్వీసు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జనవరి 24న గ్రూప్-3 ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 22 సాయంత్రం నాటికి 4.78 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇక చివరి రోజుతో కలిపి మొత్తం 1,375 పోస్టులకు గడువు ముగిసే సమయానికి 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు 390 మంది పోటీపడనున్నారు. అయితే, చివరి మూడు రోజుల్లో మాత్రం దాదాపు 90,147 మంది దరఖాస్తు చేసుకోగా, గడచిన 24 గంటల్లో ఏకంగా 58,245 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. దీంతో టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసిన గ్రూపు పోస్టు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
TS Group 3 పోస్టులు: ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే?
-