Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

-

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను జరపనున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉండగా… ప్రతీ పేపర్ 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు ఉంటుంది. కాగా, ఈ నెల 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జరగగా… త్వరలోనే ఫలితాలు వెలువడనున్నాయి. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.

- Advertisement -

మెయిన్స్ పరీక్షల షెడ్యూల్:

అక్టోబర్ 21-జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫయింగ్ టెస్ట్)

అక్టోబర్ 22-పేపర్ 1 (జనరల్ ఎస్సే)

అక్టోబర్ 23-పేపర్ 2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)

అక్టోబర్ 24-పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)

అక్టోబర్ 25-పేపర్ 4 (ఎకానమి అండ్ డెవలప్మెంట్)

అక్టోబర్ 26-పేపర్ 5 (సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ ప్రిటేషన్)

అక్టోబర్ 27-పేపర్ 6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...