Side Effects of Over Sitting | ఎక్కువ కూర్చోవడం స్మోకింగ్ చేసినంత ప్రమాదమని నిపుణులు చెప్తుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా అధికశాతం మంది రోజుకు 6గంటలకన్నా ఎక్కువ సేపే కూర్చొంటున్నారు. ఆఫీసులోనే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ చూస్తూ అని, ల్యాప్‌టాప్‌లో పని అని, ఫోన్ చూసుకుంటూ ఎక్కువ సేపు కూర్చునే ఉంటున్నారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం మన శరీరానికి ఎంతో ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఇలా ఆరు గంటల కన్నా ఎక్కువ సేపు కూర్చోవడం చాలా డేంజర్ అని తేలింది. ఇలా రోజూ ఆరు గంటలకన్నా ఎక్కువ సేపు కూర్చునే వారికి ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు. అసలు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలేంటో చూద్దామా..
Side Effects of Over Sitting :
వెన్ను నొప్పి: అధిక సమయంపాటు కూర్చునే ఉండటం వల్ల వెన్నెముకపై ఒత్తిడి అధికమవుతుంది. ఇది వెన్ను, మెడ, నడుము నొప్పికి దారిస్తుంది. మెడ కండరాలు కూడా బిగుసుకుపోతాయి. అంతేకాకుండా ఎక్కువ సేపు ఒకేలా కూర్చుని ఉండటం వల్ల వెన్ను సమస్యలు కూడా అధికంగా వస్తాయని నిపుణులు చెప్తున్నారు.
మానసిక అనారోగ్యం: ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరిక శ్రమ లేకపోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మెదడుకు కావాల్సిన స్థాయిలో రక్త ప్రసరణ జరగదు. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశకు దారితీస్తుంది. దాని కారణంగా అనేక మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అధకబరువు: గంటల తరబడి కూర్చునే ఉండటం ఊబకాయానికి దారితీస్తుంది. మన ఆహారం ద్వారా తీసుకునే క్యాలరీలు చాలా నెమ్మదిగా ఖర్చవుతాయి. దీని వల్ల కడుపు, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మన బరువు అధికం చేస్తుంది.
గుండె జమ్ములు: ఎక్కువ సేపు కూర్చోవడం మన గుండెకు చాలా ప్రమాదం చేస్తుంది. ఇలా ప్రతి రోజూ ఆరుగంటలకన్నా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30శాతం అధికమవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. నిరంతరం కూర్చునే ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అది గుండెపోటు ప్రమాదాన్ని అధికం చరేస్తుంది.
మధుమేహం: ఎక్కువ సేపు కూర్చునే ఉండటం మన జీర్ణప్రక్రియపై, జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఇన్సులిన్‌కు ప్రతిస్పందించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఉద్యోగం, బాధ్యతలు కూర్చోక తప్పదు అని అనచ్చు. కానీ, ఉద్యోగ చేసుకుంటూనే ఈ సమస్యలు తలెత్తకుండా నివారించుకోవచ్చు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటంటే..
ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోవాలి.
2-3 నిమిషాల పాటు నడవడం, తేలికపాటి స్ట్రెచింగ్చేయాలి.
మీ వర్క్ స్టేషన్‌ను మార్చి నిలబడి పని చేయడానికి ప్రయత్నించండి.
శారీరిక శ్రమను పెంచండి. లిఫ్ట్‌కు బదులు మెట్లను వాడండి. ఆఫీసు, ఇంట్లో నడుస్తూ పనిచేసేలా చూసుకోండి.
వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోండి. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, వ్యాయామం చేయండి.