Best Face Mask | తెల్లని చర్మం కోసం తేలికైనా చిట్కాలు..

-

అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటుంటారు. అందుకోసం తెల్లగా రావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చెప్పే రకరకాల రెమెడీలను ట్రై చేసి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. కొందరైతే వీటితో చర్మంపై లేనిపోని మచ్చలు వచ్చి మరింత ఆత్మనిమ్యూనతకు గురవుతుంటారు. మొఖంపై ఏదైనా ఎలర్జీ వస్తే ప్రధానంగా పసుపు రాయడం ద్వారా దానిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తగ్గని సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది. కానీ కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. కానీ తెల్లటి చర్మమే అందం అనుకోవడం మాత్రం భ్రమే అని అంటున్నారు. అయితే చర్మం తెలుపుకు రావడం కోసం ఈ చిట్కాలను పాటించమంటున్నారు. మరి ఆ చిట్కాలు.. ఫేస్ మాస్క్‌లు(Best Face Mask) ఏంటంటే..

- Advertisement -

అవకాడో, తేనె: సగం అవకాడో, టీస్పూన్ తేనె తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆతర్వాత వచ్చిన మిశ్రమాన్ని మొఖానికి బాగా పట్టించాలి. 20 నిమిషాలు ఆగిన తర్వాత గోరు వెచ్చని నీటితో మొఖాన్ని కడిగేసుకోవడమే. అవకాడాలో ఉండే విటమిన్-ఇ చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. తేనె చర్మానికి గ్లో వచ్చేలా చేస్తుంది. దీనిని వారంలో రెండు మూడు సార్లు చేస్తే చాలు మూడు వారాల్లోనే మన చర్మంలో తేడాను చూడొచ్చని సౌందర్య నిపునులు చెప్తున్న మాట.

ఓట్స్, పెరుగు: రెండు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల ఓట్స్ తీసుకోవాలి. ముందుగా ఓట్స్‌ను పౌడర్‌లా చేసుకుని అందులో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొఖానికి పట్టించి. ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ మిశ్రమం బాగా ఆరిపోయే వరకు లేదా 20-30 నిమిషాల పాటు ఉంచుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి. పెరుగు మన చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. కాగా ఈ మిశ్రమాన్ని ఆయిల్ స్కిన్ వారు కూడా ట్రై చేయొచ్చు.

అరటిపండు, తేనె: టీస్పూన్ తేనె, సగం అరటి పండు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొఖానికి మాస్క్ తరహాలో వేసుకోవాలి. 20 నిమిషాలు ఉంచుకుని కడిగేసుకుంటే సరిపోతుంది. అరటిపండు మన చర్మాన్ని మృధువుగా చేస్తుంది. అదే విధంగా తేనె మన చర్మానికి కావాల్సిన తేమను అందించడంతో పాటు చర్మం గ్లో వచ్చేలా చేస్తుంది.

శనగపిండి, పెరుగు: మూడు స్పూన్ల శనగపిండి, రెండు టీస్పూన్ల పెరుగు తీసుకుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్చర్‌ను మొఖానికి పట్టించి అరగంట ఆగిన తర్వాత కడిగేసుకోవాలి. శనగపిండి చర్మంలోని మలినాలను తీసేయడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగు చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది.

రోజ్ వాటర్, గ్లిజరిన్: రెండు స్పూన్ల రోజ్ వాటర్, టీస్పూన్ గ్లిజరిన్‌ను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మొఖానికి పట్టించాలి. అరగంట ఆగిన తర్వాత కడిగేసుకోవాలి. రోజ్ వాటర్ మన చర్మం రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. గ్లిజరిన్ చర్మంలోని తేమను పెంచి అందంగా మారుస్తుంది.

Best Face Mask | వీటితో పాటుగా ఇంత పని కూడా చేసుకోలేం అనుకునే వారు. మార్కెట్లో దొరికే విటమిన్-ఇ కాప్సుల్స్‌ను తీసుకుని.. ఒక కాప్సుల్‌కు రంధ్రం చేసి లోపలి ఔషదాన్ని చేతిలో వేసుకోవాలి. అందులో రెండు మూడు చుక్కల కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ కలుపుకుని మొఖానికి బాగా పట్టించాలి. అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా చర్మ సౌందర్యం పెరుగుతుందని సౌందర్య నిపుణులు చెప్తున్నారు.

Read Also: హెయిర్ ఫాల్‌కు అద్భుత చిట్కాలు.. ఇవి వాడితే రాలమన్నా జుట్టు రాలదు..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...