లైంగిక స్టామినా పెరగాలంటే పురుషులు ఇవి మానుకోవాల్సిందే..!

-

ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు(Sex Stamina) అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి జీవనశైలితో పాటు వారి అలవాట్లు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత యువతలో లైంగిక స్టామినా తగ్గడానికి వారి రోజు వారి అలవాట్లే కారణమని, ఈ సమస్య ఈ తరం యువతలో రోజు రోజుకు అధికం అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే తమ అలవాట్లను కాస్తంత మార్చుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చని చెప్తున్నారు. చాలా మంది యువకులు తమ స్టామినాను పెంచుకోవడం కోసం అనేక మల్టీవిటమిన్లు, సెప్లిమెంట్లను తీసుకున్నప్పటికీ పురుషుల్లో ఫలితం కనిపించడం లేదు. దీంతో వారు మరింత నిస్సత్తువకు గురవుతున్నారని, అయితే మన రోజూ అలవాట్లు కొన్ని మార్చుకుంటే ఎటువంటి మందులుమాకులు వాడకుండానే లైంగిక స్టామినా పెరుగుతుందని చెప్తున్నారు వైద్యులు. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా చేసే పనులేనని, కాబట్టి వీటిని మానేయడం ద్వారా లైంగిక స్టామినాను పెరుగుతుందని చెప్తున్నారు.

- Advertisement -

నిద్ర: ప్రస్తుతం యువతలో నిద్రలేమి అధికంగానే ఉంటుంది. పని భారం వల్లనో మరే ఇతర కారణాల వల్లనో శరీరానికి కావాల్సిన విశ్రాంతిని ఇవ్వలేకపోతున్నారు. నిద్ర తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో భాగంగానే పురుషుల్లో లైంగిక స్టామినా కూడా తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు. నేటి పరుగుల ప్రపంచంలో యువతకు ముందు ఉన్న అతిపెద్ద సమస్య నిద్రలేమి అని అంటున్నారు. దీనిని సరిచేసుకోవడం ద్వారా.. ప్రతి రోజూ శరీరానికి సరిపడా నిద్రను అందించడం ద్వారా మన ఆరోగ్యాన్ని తిరిగి గాడిన పెట్టొచ్చని, లైంగిక ఆరోగ్యం కూడా పెరుగుతుందని అంటున్నారు.

మద్యం: ఈ తరం యువతలో చాలా వరకు అందరికీ మద్యం, ధూమపాన అలవాటు ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఒక్క అలవాటు ఉన్నా అది వారి లైంగిక స్టామినాపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. మద్యం, ధూమపానం వల్ల సాధారణంగా మన పూర్త స్టామినా తగ్గుతుందని, అందులో భాగంగానే లైంగిక స్టామినా కూడా తీవ్రంగా క్షీణిస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ అలవాటు ఉన్నవారు.. దీనిని ఒక్కసారిగా మానేయడం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని, కాబట్టి వీటిని మెల్లిగా వదులుకోవాలని సూచించాలి.

డీహైడ్రేషన్: శరీరంలో నీటి శాతం తగ్గడం కూడా లైంగికక స్టామినాపై ప్రభావం చూపుతుంది. ప్రతి రోజూ తగినంత నీరు తాగకపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుందని, ఇది కూడా పురుషుల్లో లైంగిక స్టామినాను తీవ్రంగా తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. కాబట్టి ప్రతి రోజూ కూడా శరీరానికి తగ్గ నీరు తాగడం తప్పనిసరి అని, దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని కూడా చెప్తున్నారు. నీరు అధికంగా తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ కూడా బయటకు వెళ్లిపోతాయని, తద్వారా ఓవరాల్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు.

కెఫిన్: ఈ తరం పురుషులు వర్క్ లోడ్ వల్లో అలవాటులో పొరపాటుగానో రోజులో ఈజీగా మూడు నాలుగు సార్లు కాఫీ, టీలు తాగేస్తుంటారు. ఈ టీలు, కాఫీలు శరీరానికి కావాల్సిన శక్తిని అప్పటికప్పుడు ఇచ్చినప్పటికీ ఇది మన శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిద్రలేమికి దారి తీయడమే కాకుండా స్టామినాను తగ్గిచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కెఫిన్ తక్కువగా తీసుకునేలా చూసుకోవాలి. కాఫీ, టీలకు బదులుగా జ్యూస్‌లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిన అంటున్నారు.

వ్యాయామం: రోజంతా పని చేసి అలసిపోయి ఇంటికొచ్చిన తర్వాత వ్యాయామం చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఒకవేళ చేద్దామనుకున్నా శరీరం అలసిపోయి అందుకు ఏమాత్రం సహకరించదు. కానీ అలా వ్యాయామం చేయకుండా ఉండటంం కూడా మన శరీరాన్ని స్టామినాను క్షీణింపజేస్తుంది. శరీరానికి కావాల్సిన వ్యాయామం లేకపోయినా పురుషుల్లో లైంగిక స్టామినా పడిపోతుంది. వ్యాయామం అంటే బరువులు ఎత్తడమే కాదని, మీకు నచ్చిన అవుట్‌డోర్ గేమ్స్, వర్కౌట్స్, యోగా ఏదైనా కావొచ్చని వైద్యులు చెప్తున్నారు. ఆఖరికి ఇంటి పక్కన ఉండే చిన్న పిల్లలతో ఆడుకోవడం పనిచేస్తుందని చెప్తున్నారు నిపుణులు.

వీటన్నింటితో పాటుగా ఆహార అలవాట్లలో కూడా మార్పులు చేయడం ద్వారా లైంగిక స్టామినాను(Sex Stamina) అధికం చేసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ప్రతి రోజూ ఫ్రూట్ జ్యూస్‌లు, వెజిటేబుల్ జ్యూస్‌లు తాగడం మేలు చేస్తుందని చెప్తున్నారు. ఫలానా జ్యూసే తాగాలని ఏమీ లేదని, ప్రతి రోజూ ఏదో ఒక జ్యూస్ తాగినా మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

Read Also: నిద్రే నిద్ర వస్తుందా.. కారణాలు ఇవేనేమో..!
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జగన్‌ను తిరుమల వెళ్లొద్దని ఎవరన్నారు: చంద్రబాబు

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు...

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...