Cycling vs Walking | అధిక బరువు, ఊబకాయం ప్రస్తుతం యువత ముందు ఉన్న అతిపెద్ద సమస్యలు ఇవే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని ఔషధాల సైడ్ ఎఫెక్ట్, వల్లకానీ, జీన్స్ లోపం ఇలా కారణం ఏదైనా యువతలో అధికబరువు, ఊబకాయస్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. దానిని తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తున్నా ఫలితం పెద్దగా కనిపించడం లేదు.
కొందరు జిమ్‌కు వెళ్తే మరికొందరు వ్యాయామం చేస్తున్నారు. మరికొందరు తమకు తెలిసిన ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తున్నారు. కాగా అధిక సంఖ్యలోని వారు ఆహారాన్ని నియంత్రించడం ద్వారా బరువు తగ్గొచ్చని, ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ, నిపుణులు మాత్రం ఇంకోలా చెప్తున్నారు. బరువు తగ్గాలంటే నోటిని కట్టేయాలి కానీ.. నోటికి తాళం వేయడం సరికాదని చెప్తున్నారు. డైట్ చేయాలని కానీ పూర్తి ఉపవాసాలు చేస్తున్నట్లు ఆహారాన్ని బాయ్‌కాట్ చేయడం మంచిది కాదని, ఇలా చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.
అదే విధంగా బరువు తగ్గాలంటే జాగింగ్, వాకింగ్ చేయాలా? లేకుంటే సైక్లింగ్ చేయాలా? అనేది కూడా చాలా మందిని పీడిస్తున్న ప్రశ్న అని తాము గుర్తించినట్లు నిపుణులు చెప్తున్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకుంటే ప్రారంభదశలో వ్యాయామాలు చేయడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజూ నడవడం ద్వారా మన ఆరోగ్యం పెంపొందుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. ఎముకలు, వెన్నునొప్పి తగ్గుతాయి. మన శరీర భంగిమ మెరుగవుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. నడకతో పోలిస్తే సైక్లింగ్ ప్రభావం ఎక్కువగా ఉండదు. అలాగని సైక్లింగ్ వల్ల లాభాలు లేవని కాదు. సైక్లింగ్ చేయడం ద్వారా కూడా అనేక లాభాలు ఉన్నాయి. కానీ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.
వాకింగ్ చేసే సమయంలో మన శరీర బరువు మొత్తాన్ని పాదాలు మోస్తాయి. సైక్లింగ్ సమయంలో అదేమీ ఉండదు. వేగంగా పెడ్లింగ్ చేయడం ద్వారా వ్యాయామ తీవ్రత పెరుగుతుంది. దీని ద్వారా రోగనిరోధక శక్తి అధికమవుతుంది. బరువు తగ్గడానికి కూడా సైక్లింగ్ అద్భుతంగా పనిచేస్తుంది.
Cycling vs Walking | కానీ వాకింగ్ ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. వాకింగ్ శరీరాన్ని బలంగా మార్చడానికి దోహదపడుతుంది. ప్రతి రోజూ ఎక్కువ దూరం నడవడం వల్ల శరీరం బలంగా మారుతుంది. సైక్లింగ్ చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ సైక్లింగ్ చేయడం వల్ల ఎక్కువ కేలరీలు కరుగుతాయి. డైట్ చేస్తూ సైక్లింగ్ చేయడం ద్వారా బరువు వేగంగా తగ్గొచ్చు.
అదే వాకింగ్ చూసుకుంటే.. దీని ద్వారా దీర్గకాలిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మనల్ని ఫిట్‌గా ఉంచుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకుంటే సైక్లింగ్ చేయడం మంచిది. అంత తొందరేమీ లేదు.. ఫిట్‌నెస్‌తో పాటు బరువు తగ్గాలి అనుకుంటే వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు.