మొటిమలు, ముడతలకి వేపతో చెక్ పెట్టేయండిలా..

-

Neem face pack: వేపనీళ్లు మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ని నివారిస్తాయి. అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించి దింపేయాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. ప్రతీరోజూ ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఫలితంగా కొన్నాళ్లకు మొటిమలూ, వాటి తాలూకు మచ్చలూ పోతాయి.

- Advertisement -

పొడిచర్మం ఉన్నవారికి వేపపొడి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. వేప ఆకుల పొడిలో కాసిని నీళ్లూ, కొద్దిగా ద్రాక్ష గింజల నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే చర్మం తాజాదనంతో మెరుస్తుంది. అలాగే వయసురీత్యా వచ్చే ముడతల్ని నివారించేందుకు ముఖానికి వేపనూనె రాసుకుని మర్దన చేసుకోవాలి.

చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు… వేప ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి, షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అలాగే వేప ఆకుల పొడిని నీళ్లలో కలిపి పేస్ట్ లా చేసి మాడుకు పట్టించి అరగంట తరవాత షాంపూతో కడిగేసినా ఫలితం ఉంటుంది.

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతోంటే.. వేపాకుల పొడిని కొంచెం నీళ్లలో కలిపి పేస్ట్(Neem face pack) చేసుకోవాలి. దాన్ని కళ్ల చుట్టూ రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. (నోట్: వేప రసం కంటి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించండి).

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...