Dinner tea: రాత్రి భోజనం తర్వాత తీసుకోవాల్సిన డిన్నర్ టీ

-

Dinner Tea: తిన్న ఆహారం డైజెస్ట్ అవకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రిళ్లు ఈ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ డిన్నర్ టీ తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు. ఈ డిన్నర్ టీ నిద్రను కలిగిస్తుంది. అరుగుదలను పెంచుతుంది. పొట్ట ఉబ్బరింపుని తగ్గిస్తుంది. గ్యాస్ ఫామ్ అవకుండా హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ డిన్నర్ టీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

కావల్సిన పదార్థాలు:

సోపు గింజలు- పావు టీస్పూన్
దాల్చిన చెక్క- ముప్పావు టీస్పూన్
జాజికాయ పొడి- పావు టీస్పూన్
నీళ్లు- 1 కప్పు
పాలు- పావు కప్పు
పాతబెల్లం లేదా తేనె లేదా పటికబెల్లం లేదా పంచదార

Dinner tea – తయారు చేసే విధానం:

ఒక కప్పు నీళ్లను స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మరిగే నీళ్లకు సోపు గింజలు పావు చెంచాడు, దాల్చిన చెక్క చూర్ణం ముప్పావు చెంచాడు, జాజికాయ పొడి పావు చెంచాడు కలపాలి. వెంటనే మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. 5 నిమిషాల తర్వాత కప్పులోకి వడపోసుకుని, పావు కప్పు పాలు కలపాలి. పాతబెల్లం లేదా తేనె లేదా పటికబెల్లం లేదా పంచదార మీ ఇష్టానికి తగ్గట్టు కలుపుకుని తాగాలి.

Read Also: జనవరిలో మొత్తం 11 రోజులు బ్యాంకులు క్లోజ్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...