Alltimereport: Flawless Skin – పింపుల్స్, యాక్నే వంటి సమస్యల కారణంగా ఏర్పడిన నల్లటి మచ్చలు అంత ఈజీగా పోవు. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలని కూడా వేధించే అతి పెద్ద సమస్య. కొంతమందికి ఈ సమస్య మరింత పెద్దదిగా ఉంటుంది. దీంతో బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నల్లటి మచ్చలు చర్మంలో కలవాలంటే చాలా సమయం పడుతుంది. వీటిని తొలగించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఒక్కోసారి అవి పని చేసినప్పటికీ.. వాటిలో ఉండే కెమికల్స్ చర్మానికి హాని చేసే ప్రమాదం ఉంది.
అయితే ఈ నల్లటి మచ్చలకు ఇంట్లో ఉండే పదార్థాలతోనే చెప్పొచ్చు అంటున్నారు మన పెద్దలు. మన బామ్మలు వాడిన చిట్కా చాలా బాగా పనిచేస్తుందట. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం. సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగిఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడనుంది. 1. చింతపండు రసాన్ని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. 2. చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసుకుని ముఖానికి రాసుకోవాలి. తర్వాత నీటితో కడిగితే చర్మంపై నలమచ్చలతో పాటు ముడతలు(Flawless Skin) పోతాయి. ఇలా వారానికి రెండుసార్లు ట్రై చేస్తే ప్రయోజనం ఉంటుంది.