అలోవెరా ని ఇలా కూడా ఉపయోగించవచ్చు అని తెలుసా?

-

అలోవెరా ఎన్నో సుగుణాలున్న ఒక ఔషధ మొక్క. కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీనిలో అంతకుమించిన ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అలోవెరా 96 శాతం నీటిని కలిగి గుజ్జు ఉంటుంది. అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. అలోవెరా గుజ్జునూ, కొబ్బరి నూనెనూ కలిపి దాన్ని తలకు పట్టిస్తే జుట్టు రిపేర్ అవుతుంది. చుండ్రు వదిలిపోతుంది. మృత కణాలు తొలగిపోతాయి. మీ జుట్టు, మెరుస్తూ, స్మూత్ గా మారిపోతుంది. జుట్టు రాలిపోయేవారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

- Advertisement -

అలోవెరాలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్లు, ఖనిజాలు ఇవన్నీ అధిక బరువును తగ్గించేవే. ప్రతి రోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తాగేయాలి. అది రుచికరంగా ఉం డకపోయినా అలా చెయ్యడం వల్ల ఎంతో మేలు. కడుపులోని కొవ్వు, చెడుపదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి. జ్యూస్ తాగలేమనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనెలాంటివి కలుపుకుంటే సరి. చర్మానికి అలోవెరా చేసే మేలు అంతా ఇంతా కాదు. కాలిన గాయాలు, వాపులకు అలోవెరా గుజ్జును రాసేసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందు అలోవెరా గుజ్జును చర్మం అంతటికీ సబ్బు రాసుకున్నట్లు రాసేసుకోవాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత స్నానం చేసేస్తే చాలు.. సబ్బుతో అవసరం. లేకుండానే చర్మం క్లీన్ అయిపోతుంది. అంతేకాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఇతరత్రా క్రిములన్నీ చనిపోతాయి. స్కిన్ మెరుస్తూ, కోమలంగా మారి ఎంతో హ్యాపీ ఫీల్ కలుగుతుంది.

బీపీ, షుగర్ వంటివి తగ్గేందుకు కూడా అలోవెరా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. రోజుకు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జ్యూస్ తాగితే బీపీ, డయాబెటిస్ కంట్రోల్ లో ఉండగలవు. ఈ విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. చర్మం తెగినా, మండినా, కాలినా, వాపు వచ్చినా, కందినా, పొడిబారినా ఇలా చర్మానికి ఏం జరిగినా ఆ ప్రదేశం లో అలోవెరా గుజ్జును రాసేయాలి. ఫలితం క్షణాల్లో కనిపిస్తుంది. గుజ్జును రాసిన తర్వాత ఆ ప్రదేశం గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. కారణం అలోవెరా జ్యూస్ అక్కడి చర్మ కణాలకు ఎనర్జీ ఇస్తుంది. ఇంట్లో ఉండే కలబంద మొక్కను రోజూ ఎంత కావాలంటే అంత కట్ చేసుకుని వాడుకుంటే ఎంతో మేలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Congress Manifesto | లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల లోక్‌సభ ఎన్నికల కోసం...

Ys Avinash Reddy | వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఊరట

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్...