Old days: అలనాటి జ్ఞాపకాలు గుర్తున్నాయా..?

-

Old days Memories of 90’s kids and they memaraised as Old days are gold: ఈరోజు బాలల దినోత్సవం అంటగా.. వాట్సప్‌ స్టేటస్‌ చూశాను.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తేదీ ఎప్పుడు మారుతుందో.. రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియటం లేదురా అని లంచ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేస్తూ తన ఫ్రెండ్‌తో అంటున్నాడు సుబ్బారావు. మన రోజుల్లో, అప్పుడు చేసిన అల్లరి అంటూ వారిద్దరి (Old days Memories) జ్ఞాపకాలు నెమరివేసుకున్నారు. ఇలా ఒక్క సుబ్బారావే కాదు.. మనలో చాలా మంది అటువంటి సుబ్బారావులు ఉన్నారు.

- Advertisement -

ఈ ఫోన్లు, ఇంటర్‌ నెట్‌లు లేనప్పుడు. ఆదివారం ఈటీవీలో వచ్చే పంచతంత్రం మీలో ఎంతమందికి గుర్తు ఉంది? అమ్మో హోం వర్కు చేయలేదు అని సోమవారం ఉదయం గుర్తుకు వస్తే.. గబగబా పుస్తకాల సంచి తీసి.. ఫాస్ట్‌ ఫాస్ట్‌ మీలో ఎంత మంది రాశారు? 90 కిడ్స్‌ నిజంగా చాలా అదృష్టవంతులం అనిపిస్తోంది కదా ఒక్కోసారి మీకు. అటు ఏడుపెంకులాట ఆడిన అనుభవం, చింతపిక్కలతో అష్టాచెమ్మా ఆటలు ఆడిన జ్ఞాపకం, ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లో పబ్జీ నుంచి సబ్‌ వే సర్ఫ్‌, పోకో వంటి ఆటలు చూడటం విచిత్రంగా అనిపిస్తోంది కదా..

ఆరోజుల్లో అయితే కరెంట్‌ ఇలా 24 గంటలు ఉండేది కాదు.. ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలన్నట్లు పిల్లలందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. పవర్‌ రేంజర్స్‌, శక్తిమాన్‌ ప్రోగ్రామ్స్‌ బహు ఫేమస్‌ అప్పట్లో. మరి ఇప్పుడో.. పిల్లలు టీవీ కాదుకదా, సరిగ్గా ఒక దగ్గరే కూర్చోవటం లేదు. అరచేతిలో వైకుంఠం అన్నట్లు స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేయటం, కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్‌ క్లాసులు రావటం.. తప్పక పిల్లలకు సెపరేట్‌గా ఫోన్లు కొనటం పరిపాటిగా మారిపోయింది. కొన్నవాటిని పడేయలేము కదా.. ఇంక అవి వారి దగ్గరే ఉండటంతో.. వాటితో పిల్లలు మరో లోకంలో విహరిస్తున్నారు.

బాలల దినోత్సవం అంటే, ఆరోజు మహా సరదాగా ఉండేది. ప్రత్యేకంగా పిల్లలను చూడటం, తప్పు చేసినా ఉపాధ్యాయుడు గుర్రుగా చూటడటమే తప్పా, కొట్టే ఛాన్సు ఉండేది కాదు.. కానీ మరుసటి రోజు ఏం జరిగేదో మీకు తెలిసే ఉంటుందిగా..చాక్లెట్లు పంచేటప్పుడు.. నా వంతు ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూడటం తరువాత మన దగ్గరకే వస్తున్నప్పుడు.. మనల్ని కాదులే అన్నట్లు పట్టించుకోలేదు అన్నట్లు నటించటం గొప్ప అనుభూతులు కదా. అందరూ కూర్చొని జోక్స్‌ వేసుకోవటం, పాటల లహరి, సీతారాములు ఆటలో సీత వస్తే నేను కాదు సీత చెప్పటానికి, దాయటానికి అవస్థలు పడటం తలుచుకుంటుంటే అబ్బా ఆ రోజులు మళ్లీ వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది కదా? మరి మీలో ఎంత మంది పై ఆటలు ఆడారో కామెంట్‌ చేయండి!

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...