ఎండాకాలం వచ్చేసింది.. మామిడిపండ్లకు EMI ఆఫర్

-

వేసవికాలం వచ్చిందంటే ఎండలతో పాటు నోరూరించే మామిడిపండ్లు ఆహ్వానం పలుకుతాయి. ఈ సీజన్ లో రకరకాల మామిడిపండ్లు మార్కెట్లో లభిస్తుంటాయి. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పాటు దిగుబడి తక్కువ రావడంతో మామిడిపండ్ల రేట్లు పెరిగిపోతున్నాయి.వీటిలో అల్ఫాన్సా రకం పండ్ల ధర అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. సామాన్యులు ఈ రకం మామిడిపండ్లు కొన్నాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. దీంతో మహారాష్ట్రలోని ఓ మ్యాంగో వ్యాపారి సరికొత్త ఆఫర్ తీసుకొచ్చాడు.

- Advertisement -

ఈఎంఐ పద్ధతిలో అల్ఫాన్సా పండ్లను కొనుక్కొని వెళ్లండంటూ ప్రకటనలు ఇచ్చాడు. దీంతో అందరూ ఈ ఆఫర్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. తమ దుకాణంలో రూ.5వేలకు పైగా మ్యాంగోస్ కొంటే క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో చెల్చించవచ్చని తెలిపాడు. పుణెలోని గురుకృప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ దుకాణం యజమాని గౌరవ్ సనాస్ మాట్లాడుతూ మామిడిపండ్లను ఇష్టపడే వారి కోసం ఈఎంఐ ఆఫర్ తీసుకొచ్చానని చెప్పాడు.ఆల్ఫాన్సా రకం మామిడిపండ్ల మామిడిపండ్ల ఖరీదు డజనుకు రూ.800 నుంచి రూ.1300గా ఉందని.. దీంతో ఇంతమొత్తం ఒకేసారి చెల్లించలేని వారు ఈఎంఐ వెసులుబాటు వినియోగించుకోవాలని పేర్కొన్నాడు.ఇప్పటి వరకు ఐదుగురు ఈఎంఐ పద్ధతిలో పండ్లను కొనుగోలు చేశారన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...