నెలసరి రెండు సార్లు వస్తుందా? దాని అర్థమేంటి?

-

ఒకే నెలలో నెలసరి(Periods) రెండు సార్లు రావడం అనేది ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. నెలసరి అనేది ఒకసారే వస్తుంది కదా.. మాకు రెండు సార్లు వచ్చింది ఏంటి అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఆరోగ్యంగా ఉన్న మహిళలకు రెండుసార్లు నెలసరి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే రెండుసార్లు నెలసరి వస్తే ఎక్కువ శాతం మంది మహిళలు కంగారు పడిపోతారు. ఏం చేయాలో అర్థం కాక సతమవుతుంటారు. అయితే ఇలా జరగడం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చని వైద్యు నిపుణులు అంటున్నారు. శరీరంలో ఉండే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్లు నెలసరి చక్రాన్ని నియంత్రిస్తాయి. శరీరంలో ఈ హార్మోన్ల స్థాయిలు అటూఇటూ అయినప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది.

- Advertisement -

పీసీఓఎస్ అనేది హార్మోన్ల సమస్య. ఇది అండాశయాల్లో చిన్న కణుతులను ఏర్పరిచి నెలసరి(Periods) చక్రాన్ని క్రమం తప్పిస్తుంది. థైరాయిడ్ గ్రంథి కూడా ఈ చక్రాన్ని నియంత్రిస్తుంది. చాలా అరుదుగా నెలసరి రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం కూడా కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఇలా ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా కొందరు మహిళలో నెలసరి ఒకే నెలలో రెండు సార్లు రావొచ్చు. ఇలా వచ్చినప్పుడు మరి ఏం చేయాలంటే?

నెలలో రెండుసార్లు నెలసరి రావడం తీవ్ర ఆరోగ్య సమస్యను సూచిస్తుండొచ్చని, కాబట్టి ఒకే నెలలో రెండోసారి నెలసరి రావడాన్ని గమనిస్తే వెంటనే స్త్రీ ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిదని నెపుణులు అంటున్నారు. ఇది చాలా ముఖ్యమని, వైద్యుడు స్త్రీలకు అన్ని పరీక్షలు చేసి తగ్గ చికిత్స అందిస్తాడు. కాబట్టి ఎవరూ కూడా ఒకే నెలలో రెండు సార్లు నెలసరి రావడాన్ని తేలికగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇది హార్మోన్ల వల్లే కలిగి ఉంటే కొన్ని సందర్భాల్లో మన డైట్ కారణంగా తగ్గిపోతుందని, కానీ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య అయితే ప్రాణాలకే ముప్పు ఉంటుంది కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని నిపుణులు అంటున్నారు.

Read Also: ఎంత తిన్నా బరువు పెరగట్లేదా.. ఇలా ట్రై చేయండి..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...