Reverse Walking Benefits | నడక మన శరీరానికి, ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. వైద్యులు కూడా ప్రతి రోజూ ఎనిమిది కిలోమీటర్ల దూరం నడవడం వల్లే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అయితే నడక ముందుకే కాదు వెనక్క సాగితే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మనం ముందుకు నడిస్తే వచ్చే ప్రయోజనాలకన్నా వెనక్కు నడవడం వల్లే అంతకు మించిన ప్రయోజనాలుంటాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. వెనక్కు నడవడం మన ఏకాగ్రత కూడా పెరుగుతుందట. కాగా సాధారణ నడక కన్నా వెనక్కు నడవటం ఒంకింత కష్టమే. ముందుకు నడిస్తే మన కాళ్లపై పెద్దగా ఒత్తిడి పడదు.. అదే వెనక్కు నడిస్తే మన కాళ్లపై ఒత్తిడి పడి కాళ్ల కండరాలు బలంగా తయారవుతాయి. అద్భుతమైన కార్డియోలా కూడా ఉపయోగపడుతుంది. ముందుకు పది నిమిషాలు నడిచేకన్నా వెనక్కు మూడు నిమిషాలు నడిస్తే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి.
Reverse Walking Benefits | రివర్స్ వాకింగ్.. సాధారణ వాకింగ్ కన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఈ రివర్స్ వాకింగ్ మన శరీరం, మెదడు మధ్య సమతుల్యతను మెరుగుపరుస్తుంది. శరీర బలాన్ని కూడా విశేషంగా పెంచుతుంది. వెనక్కు నడిస్తే నడిచినంత సేపు మన దృష్టి నడకపైనే ఉంటుంది. తద్వారా ఏకాగ్రత విశేషంగా పెరుగుతుంది. దీంతో పాటు బరువు తగ్గించడంలో కూడా కీలకంగా మారుతుంది. మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పికి కూడా రివర్స్ వాకింగ్‌తో చెక్ చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఈస్ట్ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజిస్ట్ నిపుణుడు జాక్ మెక్‌నమరా కూడా అంటున్నారు.