పర్ఫ్యూమ్ నేరుగా వాడితే చర్మం పరిస్థితి అంతే..!

-

పర్ఫ్యూమ్(Perfumes) వినియోగం ప్రస్తుతం షరా మామూలయిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పర్ఫ్యూమ్ వాడుతూనే ఉంటారు. కాగా చాలా మంది ఈ పర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేసేసుకుంటారు. ఇలా చేయడం మన చర్మంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. పర్ఫ్యూమ్ అన్నీ కూడా రకరకాల రసాయనాలను కలిపి తయారు చేస్తారు. ఈ రసాయనాలు డైలీ నేరుగా చర్మంపై పడటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దానికి తోడు చాలా మంది పర్ఫ్యూమ్‌ను ప్రతి రోజూ దాదాపుగా ఒకే ప్రదేశంలో కొడుతుంటారు.. ఇలా చేయడం రిస్క్‌ను మరింత పెంచుతాయని అంటున్నారు నిపుణులు. అలాగని రోజుకోచోట పర్ఫ్యూమ్ వినియోగించాలని కాదు. వీలైతే వీటిని మన దుస్తులపై వాడుకోవాలని చెప్తున్నారు. ఇంతకీ పర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మంపై వాడితే ఏమవుతుందో తెలుసా.. మరి రండి తెలుసుకుందాం.

- Advertisement -

ఇన్‌ఫెక్షన్లు: పర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మంపై అప్లై చేయడం అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. పర్ఫ్యూమ్‌లలో ఉండే ఆల్కహాల్.. మన చర్మంలో ఉండే తేమను గ్రహిస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోయి.. అనేక రకాల చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. పర్ఫ్యూమ్‌లలో ఉండే న్యూరోటాక్సిన్స్ మన నాడీవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఇదే విధంగా పర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మంపై రోజూ అప్లై చేయడం వల్ల.. చర్మం చికాకుకు గురవుతుంది. ఇది సున్నితమైన చర్మంపై మరి హానికరమైన ప్రభావం చూపుతుంది.

హార్మోన్లపై ప్రభావం: పర్ఫ్యూమ్‌లను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చర్మ వ్యాధులే కాకుండా హార్మోన్లలో అసమతుల్యత వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. పర్ఫ్యూమ్‌లో సువాసన కోసం వాడే రసాయనాలు ఈ హార్మోన్ల సమస్యకు ప్రధాన కారణమవుతాయి. అదే విధంగా చర్మ క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయని నిపుణులు వివరిస్తున్నారు.

శ్వాసకోశ వ్యాదులు తప్పవు: చాలా వరకు పర్ఫ్యూమ్‌లలో థాలేట్స్, స్టైరిన్, గెలాక్సోలైడ్స్, గ్లైకాగ్స్ వంటి సమ్మెళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి అధికంగా వచ్చి చేరితే.. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా మరెన్నో అలెర్జీలకు, బ్యాక్టీరియాకు మన శరీరం నెలవుగా మారుతుంది.

కావున చాలా వరకు పర్ఫ్యూమ్(Perfumes) వాడే అలవాటు ఉన్నవారు వాటిని దుస్తులపై అప్లై చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా తరచుగా పర్ఫ్యూమ్‌ల వినియోగాన్ని కూడా తగ్గించుకుంటే మంచిదని, ఏదైనా స్పెషల్ ఎకేషన్స్ ఉన్నప్పుడు పర్ఫ్యూమ్‌లు వాడుకోవడం మేలని అంటున్నారు.

Read Also: బొప్పాయి ఆకులతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...