అతిగా ఆలోచిస్తున్నారా.. ఇక అంతే సంగతులు!

-

అతి ఆలోచన(Overthinking) ప్రస్తుత బిజీ తరంలో అతి సాధారణ సమస్య అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంపై ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఉన్న సమస్యలు కావచ్చు, వాటికి కావాల్సిన పరిష్కారాలు కావొచ్చు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఇది మామూలే కదా అనుకుంటే చిక్కుల్లో పడక తప్పదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అతిగా ఆలోచించడం ఎంత అతి సాధారణం అనుకుంటున్నామో ఇది మన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపడం కూడా అతి సాధారణమని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

అతిగా ఆలోచించడం మన ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందంటున్నారు. దీనిని ముందే గుర్తించి అతిగా ఆలోచించడా మానుకోవడం, లేదా వైద్యులను సంప్రదించడం మంచిదని చెప్తున్నారు. కాగా అతిగా ఆలోచించడానికి అడ్డుకట్ట వేయడం అంత తేలిక కాదని, అందుకు ప్రతి ఒక్కరికీ ఉండే సమస్యలే కారణమని చెప్తున్నారు. ఒక సమస్యకు పరిష్కారం లభించింది అనుకునేలోపే మరో సమస్య వస్తుంటుందని, అందువల్ల ఓవర్ థింకింగ్‌ను తగ్గించడం అంత సులభం కాదని చెప్తున్నారు. అయితే ఇందులో తొలి అడుగు వచ్చి సమస్య గురించి కాకుండా.. దాని పరిష్కారం కోసం ఆలోచించాలని చెప్తున్నారు. అలా కాకుండా సమస్యలనే తలచుకొని కూర్చుంటే అందులో పడి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు వైద్యులు.

అసలు సమస్యను ఎలా గుర్తించాలి..

అతిగా ఆలోచించడాన్ని మానుకోవడం కష్టం కానీ.. గుర్తించడం అంత కష్టమైన పనేమీ కాదని నిపుణులు అంటున్నారు. ఒక ఘటన, సమస్య, పరిస్థితి ఇలా ఏదైనా ఒకే దాని గురించి పదేపదే ఆలోచిస్తూ ఉంటే దాన్నే అతిగా ఆలోచించడం అంటారు. అలా చేయడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు కదా పైగా అందులోనే చిక్కుకుపోయి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. సమస్య చిన్నదే అయినా దాని పరిష్కారం కోసం చేసే ఆలోచన మాత్రం తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది. గోటితో పోయే దాని కోసం అతిగా ఆలోచించి(Overthinking) గొడ్డలి దాకా తెచ్చుకోవడమే అతిఆలోచన సమస్య ఫలితం. ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండటమే కాకుండా.. ఒకదానికి మరొక సమస్యను కలుపుకుని దానికి ఇంకేదో విషయాన్ని కూడా ఆలోచించడం మొదలు పెట్టడమే అతిగా ఆలోచించడం.

దీనిని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని, అవి పాటించినా తగ్గని సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఔషదాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్న మాట. అలా కాదని ఉత్తి ఆలోచనే కదా అని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు నిపుణులు. మరి ఇంతకీ ఆ మార్గాలేంటంటే..

వర్తమానంపై దృష్టి: జరిగిపోయిన విషయం గురించో.. జరగాల్సిన దాని గురించో ఆలోచిస్తూ చింతించే కన్నా ఇప్పుడు జరగాల్సిన దానిపై దృష్టి పెట్టడం మంచిది. ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. అలా ఉంటే ఎవరు ఏమనుకుంటారో అన్న ఆలోచనను వదిలి మీకు నచ్చినట్టు మీరు ఉండాలి.

సానుకూల ఆలోచన: ప్రతికూల, నెగిటివ్ థాట్సే అతి ఆలోచనకు ప్రధాన, ప్రాథమిక కారణం అవుతాయి. అలా కాకుండా అంతా మంచే జరుగుద్ది అన్నట్లు సానుకూలంగా ఆలోచించడం వల్ల అతి ఆలోచనను(Overthinking) తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అలా ఆలోచించేలా మన మనసును రెడీ చేయాలి. అంతేకాకుండా ఒత్తిడిని మరిచి ఎంజాయ్ చేయడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెప్తున్న మాట.

ధ్యానం: అతి ఆలోచన, ఒత్తిడికి ప్రతిరోజూ ఉదయాన్నే చేసే కొద్దిసేపటి ధ్యానం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు, ఒక విధమైన పాజిటివ్ ఫీలింగ్ మనలో పెరుగుతుందని వైద్యులు చెప్తున్న మాట. 15 నిమిషాల ధ్యానం అంత ఒత్తిడి, అతి ఆలోచనను దూరం చేస్తుందా అని అనుకోవచ్చు. కానీ ఉదయాన్నే చేసే 15 నిమిషాల ధ్యానం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, ఇది మానసిక ఒత్తిడినే కాకుండా ఎన్నో రుగ్మతల నుంచి కూడా మనల్ని కాపాడుతుందని అంటున్నారు నిపుణులు.

Read Also: టిఫిన్ చేయడం మానేస్తే ఇన్ని తిప్పలా..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...