Silky Hair |ప్రతి ఒక్కరి అందాన్ని జుట్టు రెండింతలు చేస్తుంది. ఆరోగ్యమైన జుట్టు ఉండటం కూడా ఒక అదృష్టమే. ఇప్పుడు బయట ఉన్న పరిస్థితితులు, పర్యావరణ కారణాలు, ఆహారపు అలవాట్లు, బిజీ జీవితం వల్ల ప్రతి ఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సిల్కీ, స్మూత్ హెయిర్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడి విసిగెత్తిపోతున్నారు. సౌందర్య నిపుణులు మాత్రం సిల్కీ, స్మూత్ హెయిర్(Smooth Hair) కావాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉండే వాటితోనే అదిరిపోయే రెమెడీ చేసుకోవచ్చని అంటున్నారు.
అదే అల్లం నూనె. చాలా మంది జుట్టు పెరగడం కోసం, జుట్టు పగుళ్లు తగ్గడం కోసం బాదం నూనె, ఆలివ్ ఆయిల్, వేపనూనె ఇలా రకరకాల నూనెలు, హెయిర్ ప్యాక్‌లు వాడి ఉంటారు. కానీ అల్లం నూనె ఒక్కటి ఈ సమస్యలన్నింటినీ తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరి అల్లం నూనె ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. రండి చూసేద్దాం..
కావాల్సిన పదార్థాలు: తాజా అల్లం, కొబ్బరి నూనె ఒక కప్పు, చిన్న గిన్నె
తయారీ విధానం: అల్లాన్ని ముందుగా పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. గిన్నెను స్టవ్ పై పెట్టి అందులో నూనె మరిగించండి. అందులో అల్లం పేస్ట్‌ను వేయండి. దానిని 15 నుంచి 20 నిమిషాలు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. దానిని వడకట్టుకుంటే నూనె విడిగా వస్తుంది. ఆ నూనెను ఏదైనా గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.
వాడే విధానం: అల్లం నూనెను జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత నూనె ఆరిపోయే వరకు ఆగి తలస్నానం చేసేయాలి. ఈ సమయంలో షాంపూ, కండిషనర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం ద్వారా స్మూత్ అండ్ సిల్కీ హెయిర్‌ను(Silky Hair) పొందవచ్చు. ఈ నూనె జుట్టు బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. చుండ్రు వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. కావాలంటే ఈ నూనెను తరచూగా కూడా వినియోగించుకోవచ్చు.
ప్రయోజనాలు: అల్లం నూనె వినియోగించడం ద్వారా జుట్టు బాగా పెరగడమే కాకుండా.. తలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా ఈ నూనె పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తూ.. బయట దుమ్మూ, ధూళి వల్ల వచ్చే అనేక సమస్యలను దూరంగా ఉంచుతుంది.