Nara Drusti: ఈ సింపుల్ రెమిడీస్ తో నరదృష్టి తొలగి అదృష్టం వరిస్తుంది!!

-

Simple remedies for evil eye or Nara drusti or buri nazar: కొంత మంది స్వార్ధం, కుళ్లు, ద్వేషంతో మనల్ని చూస్తే వారి నుండి మనకి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. దీనినే చెడు దృష్టి లేదా నర దృష్టి లేదా కంటి దృష్టి అంటుంటారు. ఈ చెడుదృష్టి ప్రభావం వలన మనకి రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ సింపుల్ రెమిడీస్ తో నరదృష్టి తొలగి అదృష్టం వరిస్తుంది అంటున్నారు పండితులు. ఇప్పుడు ఆ పరిహారాలేంటో తెలుసుకుందాం.

- Advertisement -

వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తవు.

అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి(Nara drusti) తొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు.

అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈతిబాధలు తొలగిపోతాయి.

శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి పటాపంచలవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీపై చెడు దృష్టి పడింది అనిపిస్తే వీటిలో ఏదైనా పరిహారాన్ని ఫాలో అయ్యి మంచి ఫలితాలు పొందండి.

Read Also: భార్యను తిడుతున్నారా… ఆలోచించండి!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....