Sleeping after lunch: చాలామందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. నిజంగానే మధ్యాహ్న భోజనం చేసాక ఓ చిన్న కునుకు తీస్తే ఆ సుఖమే వేరు. ఫుల్ గా పంచభక్ష పరమాణాలతో భోజనం అయ్యాక నిద్రలోకి జారుకుంటే స్వర్గం కనిపిస్తుంది. కానీ ఆ నిద్ర 90 నిమిషాలు దాటితే మాత్రం డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు(Sleeping after lunch) ఉన్న వారు 90 నిమిషాల లోపే నిద్రపోవాలట. అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు ఆరోగ్యకరమైన నిద్ర కేవలం రాత్రి సమాయాల్లోనే అని, అది కూడా ఏడు నుంచి పది గంటల వరకు మాత్రమే నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అది కూడా వయసును బట్టి నిద్రపోవాలి అని చెబుతున్నారు.
మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే డేంజర్ అని తెలుసా?
-