స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా.. ఈ ఆహారం తినేయండి..

-

Stop Smoking | స్మోకింగ్ మానేయడం అనేది చాలా మందికి సాధించలేని లక్ష్యంలానే ఉంటుంది. ధూమపానాన్ని మానేయాలని ఎంత ప్రయత్నించినా అది రెండు మూడు రోజులకు.. మహా అయితే ఒక వారానికే పరిమితం అవుతుంటుంది. అయితే ఈ కష్టమైన, గొప్ప ప్రయాణాన్ని సులభతరం చేయడంలో కూడా ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతి స్మోకర్ జీవితంలో కూడా ధూమపానం మానేయాలని అనేది ఓ గొప్ప ఆశయం. ఇది సాధించిన వారిని తప్పకుండా అప్రీషియేట్ చేయాల్సిందే. అయితే నిపుణుల ప్రకారం.. స్మోకింగ్ మానేయాలని అనుకునేవారికి మంచి ఆహార అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది. మన ప్రతిరోజూ ఆహారంలో న్యూట్రీషినల్ ఆహారాన్ని చేర్చుకోవడం ధూమపానాన్ని మానేయాలన్న జర్నీలో మనకు ఊతమిస్తుంది. అందుకే తాము స్మోకింగ్ మానేయాలని భావించే ప్రతి ఒక్కరికి కూడా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, ఫలాలు, గింజలు, కూరగాయలు చేర్చుకోవడం మంచిదంటున్నారు. ఇవి స్మోకింగ్ వల్ల ఏర్పడిన ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. స్మోకింగ్ మానేయాలనుకునే వారు ఆహారంలో ఇవి చేర్చుకుంటే మంచిది..

- Advertisement -

1) యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు, వెజిటేబుల్స్, ఆకుకూరలు, కారెట్లు చేర్చుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిన తగ్గించడంలో, కణాలను రిపేర్ చేసుకోవడంలో సహాయపడతాయి.

2) ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్: ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా చేపలు, ఫ్లాక్స్ విత్తనాలు, వాల్‌నట్స్ వంటిని తీసుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వు.. యాంటీ-ఇఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి స్మోకింగ్‌కు చెందిన మంట వంటి భావనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

3) విత్తనాలు, గింజలు: అదే విధంగా స్మోకింగ్ మానేయాలన్న(Stop Smoking) దృఢ నిశ్చయంతో ఉన్న వారు తమ స్నాక్స్‌లో బాదం పప్పు, సన్‌ఫ్లవర్ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు వంటివి తినాలి. వీటిలో విటమిన్-ఈ పుష్కలంగా ఉండి మన చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపయోగపడతాయి.

4) తృణధాన్యాలు: ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు మన ఎనర్జీని స్థిరంగా విడుదలయ్యేలా చూస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలను కూడా స్థిరీకరిస్తాయి. దాంతో పాటుగా ధూమపానం మానేయడం వల్ల పొగ తాగాలని అనిపించే కోరికలను అదుపు చేయడంలో కీలకంగా పనిచేస్తాయి.

5) హైడ్రేషన్: వీటన్నింటితో పాటుగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. అధిక మొత్తంలో నీళ్లు, హెర్బల్ టీ వంటి తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. హైడ్రేటెడ్‌గా ఉండటం స్మోకింగ్ క్రేవింగ్స్‌ను తగ్గిస్తుంది. వీలైనంత వరకు గ్రీన్ టీ తాగడం మరింత సహాయపడుతుంది.

6) అంతేకాకుండా కాల్షియం అధికంగా ఉండే డైరీ, ఫోర్టిఫైడ్ ఆకుకూరల ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. స్మోక్ చేయడం వల్ల శరీరంలోని కాల్షియం స్థాయిలు తగ్గిపోతాయి. వాటిని మెయింటెన్ చేయడంలో, తిరిగి ఉత్పత్తి చేయడంలో ఈ ఆహారం బాగా ఉపయోగపడుతుంది.

Read Also: ఈ వెజిటేబుల్స్ తింటే రాయిలాంటి కొవ్వైనా వెన్నలా కరగాల్సిందే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mahesh Kumar Goud | ‘అదానీ అరెస్ట్ అయితే.. మోదీ రాజీనామా తప్పదు’

అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar...

KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...