Zodiac signs: ఈ రాశుల్లో పుట్టిన వాళ్లకు అమ్మాయిలు ఆకర్షితులవుతారట

-

Zodiac signs: హలో గురూ ప్రేమ కోసమే రా ఈ జీవితం అంటూ పాటలు పాడుకునే వారు చాలా మంది ఉన్నారు కదా? అవును మరి తనకు తగ్గ అమ్మాయి కోసం అబ్బాయిలు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. బస్టాంపుల దగ్గర, గుడి బయట, కాలేజీ వద్ద అమ్మాయిల కోసం ఎదురు చూడటం, నచ్చిన అమ్మాయిని సెలక్ట్‌ చేసుకోవటం అబ్బాయిల జీవితాల్లో మోస్ట్‌ ఇంపార్టెంట్‌ పార్ట్‌ అని చెప్పుకుంటారు. కానీ కొందరు ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా ఆకర్షితులు కానీ.. మరి కొందరి చుట్టూ అమ్మాయిలు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే, వారి రాశుల ప్రభావం అవ్వొచ్చు. అమ్మాయిలు ఏ రాశి (Zodiac sign) వారికి ఆకర్షిలవుతారో తెలుసుకుందాం రండి.

- Advertisement -

మేష రాశి
అమ్మాయిలను ఆకర్షించటం అంత తేలికైన పని కాదు. కానీ మేష రాశిలో జన్మించిన వారికి అలా కాదు. ఈ రాశి చక్రంలో పుట్టిన వారికి, స్త్రీలను ఆకట్టుకోవటానికి పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ప్రత్యేక వ్యక్తిగా, మరిచిపోలేనివారిగా మారిపోతారట. ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరట. వారు ఏమి చెయ్యాలని అనుకుంటున్నారో, అది కచ్చితంగా చేసి తీరుతారట. వీరు ఎంతో పట్టుదల గలిగిన వారు కావటంతో, ఏం చెయ్యాలని అనుకుంటున్నారో, అది సాధించుకుంటారట. అమ్మాయిల విషయంలో కూడా అలానే జరుగుతుందట.

మిథున రాశి
మిథున రాశి వారు ఎవరితోనైనా మాట్లాడేందుకు వెనుకాడరు. ఓపెన్‌ మైండెడ్‌గా ఉంటారు. అమ్మాయిలతో ఫ్లర్ట్‌ చేయటంలో వారు సిద్ధహస్తులు. అమ్మాయిలను ఆకర్షించే విధంగా ఉండే బాడీ లాంగ్వేజీ మిథున రాశి వారి సొంతం. తన మాటలతో మైమరిపిస్తారట. తన మాటలకు అమ్మాయిల నుంచి ఏ విధమైన ప్రతిస్పందన వస్తుందో ముందుగానే తెలిసిపోతుందట. అందుకే వారి చాలా తెలివిగా వ్యవహరిస్తారట అమ్మాయిలతో. వీరి మాటలతో అమ్మాయిలు ఇట్టే ఆకర్షితురవుతారట

సింహ రాశి
ఒకర్ని అనుకరించరు సింహ రాశి వారు. దీంతో వారు గుంపులో గోవింద లెక్క కాకుండా.. అందరిలో స్పెషల్‌గా ఉంటారు. అందువల్ల చాలా ఈజీగా అమ్మాయిలు ఆకర్షితులవుతారు. ఆడవారి ముఖాల్లో చిరునవ్వు తెప్పించే విధంగా, ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంచుతారట. వీరు అబద్ధం చెప్పటానికి అస్సలు ఇష్టపడరట. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్తారట. ఆడవారి విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారట. దీని వల్ల అందరి చూపూ సింహ రాశివారిపై (Zodiac signs) పడుతుందట.

తులా రాశి
తులా రాశిలో పుట్టిన వారు అందమైన శరీర ధారుఢ్యంతో ఉంటారట. ఈ రాశి వారు నవ్వితే, అవతలి ఉన్న ఆడవారు చూస్తూనే ఉండిపోతారట. పైగా ఈ రాశి వారు అత్యంత శృంగారభరితమైన వ్యక్తుల్లో వీరు టాప్‌ లిస్ట్‌లో ఉంటారట. ఎప్పుడు రొమాంటిక్‌ భావాలు చూపించాలో, ఎప్పుడు అమ్మాయిలను తాకాలో, ఎప్పుడు జోక్స్‌ వేయాలో అన్న విషయాల్లో వీళ్లను కొట్టిన వాళ్లే ఉండరట. అమ్మాయిల విషయంలో ఏం చేసినా పర్‌ఫెక్ట్‌గా, ఎక్స్‌పర్ట్‌గా చేస్తారట. అందుకే తులా రాశి వారికి అమ్మాయిలు తొందరగా ఎట్రాక్ట్‌ అవుతారట.

మీన రాశి
మీన రాశి వారికి సిగ్గు ఎక్కువ.. కానీ అమ్మాయిల విషయంలో కాదు. వారికి అమ్మాయిలను ఎలా ఆకట్టుకోవాలో తెలుసు. పైగా మిథున రాశి వారు చాలా రహస్యంగా ఉంటారు. ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారంటే.. పక్కన ఉన్న మరొకరికి తెలియనంతగా సీక్రెట్‌గా మెయిన్‌టైన్‌ చేస్తారట. ఈ రహస్య విధానం అమ్మాయిలకు నచ్చుతుందట. అందువల్లే మీన రాశి వారికి అమ్మాయిలు అట్రాక్ట్‌ అవుతారట. వారు ఫ్లర్ట్‌ చేసేటప్పుడు మరో ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉంటుందట. మీన రాశి వారి మాటల మాయ నుంచి బయటకు రావటం అంత సులభం కాదట.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...