Two commodes in one bathroom: నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అంటూ పాడుకునే గాఢ ప్రేమికులైనా.. ఏమన్నావో.. ఏమి విన్నానో అంటూ కచేరీ పెట్టుకునే భార్యాభర్తలైనా కలిసి ఎవరూ బాత్‌రూంకు వెళ్లు కదా. కానీ తమళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని ఓ కార్యాలయ భవనాన్ని తాజాగా ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉన్నా.. బాత్రూం విషయానికి వచ్చేసరికి కొలీగ్స్ ఎక్కడికైనా కలిసి వెళ్తారని మేస్త్రి అనుకున్నాడో, గోడ కట్టడం మర్చిపోయాడో తెలియదు గానీ.. ఒకే బాత్రూంలో నిర్మించిన రెండు కమోడ్స్ two commodes in one bathroom దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వెస్ట్రన్ స్టైల్‌లో టాయిలెట్ నిర్మాణం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రెండు కమోడ్‌ల మధ్య కనీసం ఎటువంటి అడ్డుగోడ లాంటి నిర్మాణం చేపట్టలేదు. పైగా బాత్రూమ్‌లోకి వచ్చే ఎంట్రీ పాయింట్ సైతం ఒక్కటే ఉంది. పైగా ఈ కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రోజల క్రితమే సీఎం స్టాలిన్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే సైతం దగ్గరుండి, పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. కోటి 88 లక్షలతో నిర్మించారన్న మాటే గానీ.. అడుగడుగునా లోపాలో కనిపిస్తున్నాయి. నాసిరకంగా గోడలు ఉండటంతో.. ప్రారంభించిన రోజుకే ఎక్కడికక్కడ బీటలు వారి విరిగిపోయాయి. దీంతో గడువులోపు పనులు పూర్తి చెయ్యాలన్న ఒత్తిడితోనే అధికారులు మమ అనిపించేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Read also: అందుకే గంగూలీ ఐపీఎల్ ఛైర్మన్ పదవి వద్దనుకున్నాడా?