Vastu Tips for Money – Vastu Tips to get more money and happy life: కష్టపడి సంపాదించిన డబ్బు పోకుండా, అది రెట్టింపు అయ్యేలా వాస్తు చూస్తుంది. తెలియక మనం చాలా వాస్తు పొరపాట్లు చేస్తుంటాం. చిన్న చిన్న అంశాలు కూడా వాస్తుపై చాలా ప్రభావం చూపుతాయి. మనం పొరపాటున చేసే వాస్తు తప్పిదాలేంటో తెలుసుకుని వాటిని పరిష్కరించుకుంటే ఎలాంటి వాస్తు లాభాలు చేకూరతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ట్యాప్లు, పైప్లు, ట్యూబ్లు, కుళాయిలు మొదలైన వాటి ద్వారా నీరు లీక్ కావడం వల్ల ఇల్లు లేదా ఆఫీస్ నుంచి డబ్బు నష్టం కలుగుతుంది. ఈ డబ్బులు నష్టం అనేది తెలియకుండా మరియు తరచుగా జరుగుతుంది. ఆర్థిక నష్టాలు రాకుండా ఉండటం కొరకు ట్యాప్ లేదా సింక్ లో నీటిని కారిపోకుండా చూసుకోండి.
మీ ఇంట్లోని తలుపులు ముఖ్య ద్వారానికి సరిసమానంగా ఉండరాదు, ఇలా ఉండటం వల్ల మీ సంపద మరియు ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. సకారాత్మక శక్తిని మీ ఇంట్లోకి ఆహ్వానించడానికి మీ ఇంట్లో పెయింటింగ్స్ మరియు చిత్రపటాలను ఉంచాలి. దీని వల్ల మీ సంపద, విద్య, ఆరోగ్యం మరియు సంబంధాలు మెరుగవుతాయి.