ఎన్నికల ప్రచారానికి ఆయన డుమ్మా

ఎన్నికల ప్రచారానికి ఆయన డుమ్మా

0
117

ప్రస్తుతం హ్యర్యానా మహారాష్ట్రల్లో ఎన్నికల సందడి నెలకొంది…. సార్వత్రిక ఎన్నికల్లో ఆకాశమంత విజయాన్ని అందుకుని రెండోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ఇక్కడ కూడా తమ సత్తాను చాటాలని చూస్తుంది…

అందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేసుకుని ముందుకు వెళ్తోంది…ఇక ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలకు అంటి ముట్లనట్లు వ్యవహరిస్తోంది.. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంను నిర్వహించలేదు… ఇదే సమయంలో పార్టీ ఛీఫ్ రాహుల్ గాంధీ బ్యాంకాక్ వెళ్లడం కూడా అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

అయితే పార్టీ నేతలు మాత్రం గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే రాహుల్ విదేశాలకు వెళ్లారని తిరిగి వచ్చిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారని తెలిపింది…