ప్ర‌భాస్ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు రోల్ ఏమిటంటే

ప్ర‌భాస్ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు రోల్ ఏమిటంటే

0
488

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్ర‌భాస్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్.. ఈ సినిమాలో ఆయన రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడు. ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈసినిమాకి టైటిల్ కూడా రెండు ఫిక్స్ చేసుకున్నారు.

వాటిలో ఒక‌టి ఫైన‌ల్ చేసి ఉగాదికి అనౌన్స్ చేసే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. ఈసినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు..

అయితే ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి, ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా మలిచినట్టు సినిమా యూనిట్ చెబుతోంది, ఇప్ప‌టికే ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు అద‌ర‌గొడుతున్నారు, తాజాగా ఆయ‌న ఈ రోల్ ఎప్పుడూ చేయ‌ని విధంగా చేస్తున్నార‌ట‌
ఓ డియర్ అనే టైటిల్ ను 90 శాతం ఫిక్స్ చేశారు అనే టాక్ కూడా న‌డుస్తోంది.