బిగ్ బాస్ తొలివారం నామినేషన్ లో ఉన్నది వీరేనా?

Who was in the Bigg Boss early nomination?

0
315

బిగ్ బాస్ ఐదో సీజన్ స్టార్ట్ అయింది ఆరంభం అదిరింది. నాగార్జున మొత్తం 19 మంది కంటెస్టెంట్లని పరిచయం చేసి హౌస్ లోకి పంపించారు. ఇక హౌస్ లో వారి ఆట ఎలా ఉంటుందా అనేది చూడాలి. ఇక తెలిసిన వారు కొందరు అయితే తెలియని వారు చాలా మంది ఉన్నారు. ఇక టీవీలో చూసి అసలు వీరు ఎవరు అని అనుకున్నారు. అయితే వారి గురించి కొంచెం తెలియచేసినా బాగుండేది కదా అని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

మొత్తంగా పది మంది ఆడవాళ్లుంటే ఈసారి తొమ్మిది మంది మగవాళ్లున్నారు. ఇందులో అన్ని రంగాల నుంచి వచ్చిన వారున్నారు. యాంకర్లు, డ్యాన్సర్లు, సింగర్, యాక్టర్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలు ఇలా అందరికి అవకాశం ఇచ్చారు. ఇక తాజాగా కొన్ని లీకులు అయితే అవుతున్నాయి.

మొదటి వారం నామినేషన్ లిస్ట్ కూడా వచ్చేసింది అంటున్నారు. తొలి వారం ఆరుగురు నామినేషన్లో ఉన్నారు.
యాంకర్ రవి, మానస్, హమీద, సరయు, కాజల్, జెస్సీ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరు నామినేషన్లో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి ఈ టాస్క్ ఏమిటి? ఎవరు నామినషన్ లో ఉన్నారు అనేది. ఇది బిగ్ బాస్ హౌస్ ఏమైనా జరగవచ్చు అంటున్నారు ఫ్యాన్స్.

గమనిక – కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తని మాత్రమే మీకు తెలియచేస్తున్నాం.