ముద్దు గుమ్మతో మరోసారి మెగాస్టార్..!!

ముద్దు గుమ్మతో మరోసారి మెగాస్టార్..!!

0
530

రీ ఎంట్రీ లో మెగా స్టార్ చిరంజీవి అదరగొడుతున్నాడు.. ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత అయన చేస్తున్న సైరా సినిమా ఇప్పటికే జనాల్లో మంచి పేరు తెచ్చుకుంది.. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం ఈ సినిమా కి హైలైట్ గా నిలవబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని షూటింగ్ వెళ్ళడానికి రెడీ గా ఉన్న ఈ సినిమా లో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఒకవేళ అదే కనుక నిజమైతే చిరంజీవితో కాజల్ అగర్వాల్ కి ఇది రెండో చిత్రం అవుతుంది. ఇంతకు ముందు ఖైదీ నెంబర్150 చిత్రంలో చిరంజీవితో ఆడి పాడింది ఈ భామ. త్వరలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది..