శేఖర్ కమ్ముల – ధనుశ్ చిత్రం ప్రకటన వచ్చేసింది

Shekhar Kammula - Dhanush movie advertisement has arrived

0
326

ముందు నుంచి కోలీవుడ్ లో చాలా విభిన్నమైన కథలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు హీరో ధనుశ్. ఆయన నటించిన చిత్రాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ధనుశ్ తో సినిమా అంటే నిర్మాతలకు దర్శకులకి ఓ ఆనందం. కచ్చితంగా పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు మంచి లాభాలు సినిమాలకు వస్తాయని నమ్ముతారు.

అయితే కధల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు ధనుశ్.ఆయన సినిమాలు మూడు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కాని రెండు రోజులుగా దీనిపై ఒకటే చర్చ మొత్తానికి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్ హీరోగా తాము ఒక సినిమాను నిర్మిస్తున్నట్టుగా నిర్మాతలు నారాయణ దాస్ , నారంగ్ ,పుష్కర్ రామ్మోహన్ రావు అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు శేఖర్ ఖమ్ముల. మరి చూడాలి ధనుశ్ ని ఇందులో శేఖర్ ఎలా చూపిస్తారో.