అల్లు అర్జున్ – కొరటాల శివ సినిమా ఎప్పుడంటే క్లారిటీ వచ్చేసింది

అల్లు అర్జున్ - కొరటాల శివ సినిమా ఎప్పుడంటే క్లారిటీ వచ్చేసింది

0
467

అలవైకుంఠపురం చిత్రం తర్వాత బన్నీ పుష్ప సినిమా అనౌన్స్ చేశారు ఈ చిత్రం చేస్తున్నారు….అయితే పుష్ప చిత్రం పాన్ ఇండియా చిత్రంగా వస్తోంది.. సుకుమార్ దీనికి దర్శకుడు… అయితే ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివతో చిత్రం చేస్తారు అనేది తెలిసిందే… ఇక కొరటాల శివ కూడా ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు.

 

అల్లు అర్జున్ తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్తో పాటు గీతా ఆర్ట్స్లో ఓ విభాగమైన జీఏ2 అఫీషియల్ కలిసి నిర్మించనున్నట్లు టాలీవుడ్ వార్తలు వినిపిస్తున్నాయి…. అయితే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అంటే తాజాగా ఏప్రిల్ 2022 తర్వాత పట్టాలెక్కనున్నట్లు యువసుధ ఆర్ట్స్ వెల్లడించింది.

 

పొలిటికల్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది అని తెలుస్తోంది, ఇక దీని కోసం ఇప్పటికే వర్క్ లో ఉన్నారట కొరటాల.. దాదాపు మరో 2 నెలల్లో ఈ సినిమా స్టోరీ రైటింగ్ పూర్తి చేస్తారు అని తెలుస్తోంది.. ఆచార్య తర్వాత ఈ సినిమాకి ఎవరిని తీసుకోవాలి కాస్ట్ అండ్ క్రూ పై టీమ్ ఫోకస్ చేస్తుందట.. మొత్తానికి ఈ సినిమా గురించి బన్నీ ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంలో ఉన్నారు.