అడగగానే ప్రభాస్ టైటిల్ ఇచ్చేశారట సరికొత్త వార్త

అడగగానే ప్రభాస్ టైటిల్ ఇచ్చేశారట సరికొత్త వార్త

0
477

నిర్మాత దిల్ రాజు అంటే సినిమా ఇండస్ట్ర్రీలో చాలా మందికి అభిమానమే.. చిన్న స్టేజ్ నుంచి పై స్ధాయికి నిర్మాతగా ఎదిగారు, అయితే ఏడాదికి పది సినిమాలు అయినా చేస్తూ దిల్ రాజు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జాను చిత్రంతో జర్నీ చేస్తున్నారు. ఆ తర్వాత వి చిత్రం రానుంది. ఆపై పవన్ కల్యాణ్ తో పింక్ రీమేక్ కూడా జరుగుతోంది.

ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఆయన. శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జాను చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా దీని గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ కీలక విషయం చెప్పారు, తమిళ్ లో వచ్చిన 96 సినిమాకి ఇది రీమేక్ అయితే ఈ సినిమాకి జాను అనే టైటిల్ బాగుంటుంది అని అనుకున్నాం.

కాని ఈ టైటిల్ ప్రభాస్ నటిస్తున్న సినిమాకు కూడా అదే జాను అనే టైటిల్ పెడుతున్నారు అని తెలిసింది..దీంతో యూవీ క్రియేషన్స్ వాళ్లను సంప్రదించానని చెప్పారు. కొన్నిరోజుల తర్వాత యూవీ క్రియేషన్స్ నుంచి ఫోన్ వచ్చిందని, జాను టైటిల్ పెట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు.
అయితే ఇలా టైటిల్ ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రభాస్ అని ఆయనకు థాంక్స్ చెప్పారు దిల్ రాజు.