క్యాస్టింగ్ కౌచ్పై సంచలన విషయం బయటపెట్టిన హీరోయిన్ వరలక్ష్మి శరత్కుమార్

క్యాస్టింగ్ కౌచ్పై సంచలన విషయం బయటపెట్టిన హీరోయిన్ వరలక్ష్మి శరత్కుమార్

0
479

దేశంలోనే క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.. అవకాశాల కోసం ఇలా వాడుకుని చివరకు మోసం చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు.. నటీమణులు చాలా మంది మీడియా ముందుకు వచ్చి ఇదే విషయం చెప్పారు.. అందులో ముఖ్యంగా శ్రీరెడ్డి పేరు వినిపిస్తుంది.. నటి శ్రీరెడ్డి ఇప్పటికీ టాలీవుడ్ లో కామరాజుల పేర్లు బయటపెడుతూనే ఉంది.

అయితే సాధారణంగా సినిమాల్లోకి వచ్చేవారికే కాదు కొందరు హీరో హీరోయిన్స్ పిల్లలు కూడా సినిమాల్లోకి వస్తారు.. వారికి కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయట, తాజాగా..హీరో శరత్కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్కుమార్ తనకు జరిగిన సంఘటన గురించి చెప్పింది.

తాను ఇప్పటికే 25 సినిమాలు చేశానని అయితే తనకి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు వచ్చాయి అని చెప్పింది.అలాంటి వారికి అమ్మాయిలు నో చెప్పడం నేర్చుకోవాలి అని ఒక ముక్కలో చెప్పేసింది . సినిమా పరిశ్రమలో నా తల్లితండ్రి ఉన్నా నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నాను. అలాంటి వారు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. అలాంటి వారి సినిమాల్లో నేను నటించాల్సి అవసరం లేదనిపించింది. నేను నటించలేదు తర్వాత నన్ను బ్యాన్ చేశారు అయినా నా శక్తితో నేను పైకి వచ్చాను అని ఆమె చెప్పింది.