దేవిశ్రీ ప్రసాద్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపిన అల్లు అర్జున్

Allu Arjun sends surprise gift to Devisree Prasad

0
305

టాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అంటే అందరికి అభిమానమే. రాక్ స్టార్ గా టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు సంపాదించారు. ఆయన పాటలు పాడుతూ బాణీలు ఇస్తుంటే అభిమానులు ఎంతో ఖుషీ అవుతారు. స్టేజ్ పై ఆయన ఉంటే ఇక ఆ సందడే వేరుగా ఉంటుంది. హీరోలతో కూడా తన మ్యూజిక్ తో స్టేజ్ పై స్టెప్పులు వేయిస్తారు డీఎస్పీ.

ఇక హీరోలు కూడా ఆయనతో చాలా సరదాగా ఉంటారు. ఎందరో యంగ్ హీరోలకి అద్బుతమైన మ్యూజిక్ అందించారు. సూపర్ హిట్ పాటలు అందించారు. తాజాగా సినీ నటుడు అల్లు అర్జున్ తనకు ఓ ప్రత్యేక బహుమతి పంపాడని దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ సమయంలో దేవీ శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆయనపై తనకున్న ఇష్టాన్ని తెలిపారు. ఆయనకు బన్నీ నుంచి గిఫ్ట్ రావడంతో చాలా ఆనందంలో ఉన్నారు. ఆయన ట్వీట్ చూస్తే, ప్రియమైన సోదరుడు బన్నీకి కృతజ్ఞతలు . ఇది లవ్లీ గిఫ్ట్ తనకు ఇది బన్నీ పంపిస్తాడని అస్సలు ఊహించలేదు, బన్నీ చాలా స్వీట్ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం పుష్ప సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు డీఎస్పీ.

మరి ఆ వీడియో చూద్దాం 

https://twitter.com/ThisIsDSP/status/1412980886740508674