పవన కల్యాణ్ రీ ఎంట్రీ సినిమాపై అనేక వార్తలు వినిపించాయి. ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ ని కూడా తీసుకునేందుకు సిద్దం అయ్యారు అని వార్తలు వైరల్ అయ్యాయి.. సీన్ కట్ చేస్తే ఇంకా ఆ సినిమా పై ఎలాంటి చర్చలు జరగలేదట. కాని మీడియాలో మాత్రం హైప్ బీభత్సంగా వచ్చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ పింక్ సినిమాలో తెలుగులో రీమేక్ అని వార్తలు వచ్చాయి, అయితే దీనికి బలమైన కారణం కూడా ఉంది. త్రివిక్రమ్ ఈ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు అనే వార్త,
అయితే వార్తలు వినిపించాయి కాని త్రివిక్రమ్ దీనిపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు, ఎక్కడా ఈ సినిమా గురించి ప్రకటన చేయడం లేదు. ముందు రాజకీయాల్లో బిజిగా ఉన్న పవన్ నిర్ణయం అడిగి స్టోరీలో ఏమైనా మార్పులు చూసి అప్పుడు సినిమా గురించి అనౌన్స్ చేయాలి అని అనుకుంటున్నారట. ఇక త్రివిక్రమ్ పారిస్ టూర్ నుంచి రావాలి అప్పుడు పవన్ తో మాట్లాడాలి ఆ తర్వాత పింక్ పై క్లారిటీ వస్తుందట. అయితే పింక్ సినిమా పవన్ ఒప్పుకున్నారని ఇందులో హీరోయిన్ అలాగే నటుల విషయాలు మాత్రం ఇంకా పవన్ తో డిస్కస్ చేయాలని నడుస్తున్న టాక్ మాత్రం పక్కా గాసిప్ అంటున్నారు పవన్ సన్నిహితులు.