భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన పూజ హెగ్డే

భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన పూజ హెగ్డే

0
448

అందాల నటి పూజ హెగ్డే టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది, ఏ సినిమా చూసినా టాలీవుడ్ లో ఆమెకు అన్నీ వరుస హిట్లు వస్తున్నాయి. ఇక ఆమె సినిమాలో ఉంది అంటే కచ్చితంగా హిట్ అవుతోంది.

ఇక తాజాగా ఈ సంక్రాంతికి రాములా రాములా అంటూ బన్నీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ఇక ఆమె అల వైకుంఠపురం హిట్ తో మరిన్ని సినిమాలు సైన్ చేసింది, ఇక నిర్మాతలు దర్శకులు కూడా ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు, ఇక తాజాగా ఆమె చేసే సినిమాలకు రెమ్యునరేషన్ భారీగా పెంచిందట.

ఆమె తన పారితోషికాన్ని రెండున్నర కోట్లు చేసిందట. అంతకి మించి తక్కువ అయితే కష్టమని చెప్పేస్తోందట. దీంతో ఆమెకు రెండున్నర ఇవ్వడానికి ఒకే చెబుతున్నారు.అఖిల్ కి జోడీగా ఆమె చేసిన సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, ప్రభాస్ తో సినిమా సెట్స్ పై వుంది. ఇక హరీశ్ శంకర్ – పవన్ కల్యాణ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలోను ఆమె నటిస్తోంది అంటున్నారు. ఇక వచ్చే రెండు సంవత్సరాల వరకూ ఆమెకు తిరుగు ఉండదు అంటున్నారు.