మల్టీస్టారర్ కు రవితేజ గ్రీన్ సిగ్నల్ మరో హీరో ఎవరంటే

మల్టీస్టారర్ కు రవితేజ గ్రీన్ సిగ్నల్ మరో హీరో ఎవరంటే

0
476

టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే దర్శకులు కూడా కమర్షియల్ జోనర్ తో ఈ సినిమాలకు కథ రెడీ చేస్తున్నారు, అయితే ఇద్దరు హీరోలకు కథ నచ్చాలి లేకపోతే స్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఉంటాయి. బడా హీరోలు అయితే ఎవరిని తగ్గించకూడదు, లేకపోతే ఫ్యాన్స్ తో కొత్త తలనొప్పి. అందుకే దర్శకులకు ఇది పెద్ద టాస్క్ .. కాని కొందరు మాత్రం మల్టీ స్టారర్ చిత్రాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇక మల్టీస్టారర్ లో మంచి కథ దొరికితే తాను చేయడానికి రెడీ అని ఎప్పటి నుంచో మాస్ మహరాజ రవితేజ చెబుతూనే ఉన్నాడు. దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు, ఇప్పుడు ఆయనకు ఓ మల్టీ స్టారర్ కథ వచ్చిందట, దర్శకుడు త్రినాథరావు నక్కిన రవితేజకు ఓ స్టోరీ వినిపించారట.

సినిమా చూపిస్త మావ, నేనులోకల్ తో హిట్ అందుకుని ,హలో గురు ప్రేమ కోసమే తో మంచి సక్సస్ లో ఉన్నారు ఆయన. తాజాగా రచయిత ప్రసన్నకుమార్ తో కలిసి ఓ స్టోరీ ప్లాన్ చేశారట. అయితే మరో హీరో ఎవరు అనేది చర్చ జరుగుతోంది. నితిన్ లేదా శర్వానంద్ అని టాక్ అయితే నడుస్తోంది. దీనికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందట.