మా ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రచారాలు, ఆరోపణలు వరకు ఉండే ఎన్నికలు ఈ సారి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. ఈ రోజు ఉదయం ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ..మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందంటూ ఆరోపించగా.. బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ‘మా’ ఎన్నికలు జరిపించాలని కోరుతూ మంచు విష్ణు ఎన్నికల అధికారికి లేఖ రాశాడు. ఇలా అభ్యర్థులు ఒకరిపై ఒకరూ ఫిర్యాదు చేసుకుంటుండగా..మరోవైపు సీవీఎల్ నరసింహ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఓ సభ్యుడిగా రెండు ప్యానల్స్‌కు నాదో విన్నపం. మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సభ్యుల కోసం ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. వాటిని ఈ సారి కూడా ఇంప్లిమెంట్ చెయాలి. ఏ ప్యానల్ గెలిచిన బిల్డింగ్ కట్టడానికి రూ. 6 కోట్లు ఇవ్వడానికి ఒక అభిమాని సిద్దంగా ఉన్నారు.
హెల్త్ ఇన్యూరెన్స్ పక్కాగా అమలు పరచడం..ఏ సభ్యుడు కూడా ఆకలి భాధ పడకుండా వాళ్లను వెంటనే ఆదుకొనే విధంగా చర్యలు తీసుకోవాలి.. ఎవరూ గెలిచినా ఈ ప్రణాళికలు అమలు చేయాలని కోరుతున్నా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా మొదట ‘మా’ అధ్యక్ష పదవికి సీవీఎల్ నరసింహ రావు నామినేషన్ దాఖలు చేసి మూడో రోజుకే ఆయన అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటూ నామినేషన్ ఉపసంహరించుకున్నాడు.