మెగాస్టార్ చిరంజీవి నెల రోజులు బిగ్ ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి నెల రోజులు బిగ్ ప్లాన్

0
482

లాక్ డౌన్ తో దాదాపు అన్నీ సినిమాలు షూటింగులు ఆగిపోయాయి, అయితే ఆచార్య సినిమా కూడా ఏడు నెల‌ల నుంచి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది, అయితే తాజాగా చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ కు చిత్ర యూనిట్ సిద్దం అవుతోంది. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.

ఈ నెల 9 నుంచి ఈ చిత్రం షూటింగ్ తిరిగి మొదలవుతుందని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియాలో ఈ రోజు వెల్లడించింది.. అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకుని ఈనెల 9 నుంచి సినిమా ప‌ట్టాలెక్కించ‌నున్నారు.

నెల రోజుల భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు, ఇక ఈ సినిమాని వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ చేయాలి అని చిత్ర యూనిట్ భావిస్తోంది, ఇక ఈ సినిమాకి కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు, అలాగే చిరు స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తోంది.. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో గెస్ట్ గా నటిస్తున్నారు. ఇక చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.