తెలుగు సినిమా ప్రపంచంలో ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్ రష్మిక మందన్నా. ఆమె చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అంతేకాదు మరిన్ని కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. చాలా మంది దర్శకులు కథలు చెబుతున్నారు.
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ. విజయ్ దేవరకొండ సరసన నటింటిన గీతా గోవిందం సినిమాతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. డియర్ కామ్రేడ్, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.
ఇక ఆమె ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. దాదాపు ఆమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి అని . సినీ వర్గాలు చెబుతున్నాయి. పుష్ప సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే హీరో శర్వానంద్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా పలు కధలు వింటోంది. ఇప్పటికే బాలీవుడ్ మిషన్ మజ్ను మూవీలో నటిస్తోంది. హీరో శివకార్తికేయన్ – అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు అనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి .అందులో కూడా ఆమె నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.