సరిలేరు నీకెవ్వరు లో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్..!!

సరిలేరు నీకెవ్వరు లో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్..!!

0
457

అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికి 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు ఫోటోగ్రఫీ రత్నవేలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక హాట్ న్యూస్ ప్రస్తుతం హల్చల్ చేస్తోంది..
అదేంటంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో మహేష్ బాబు సరసన స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా స్టెప్పులు వేయనుందట ఇంతకు ముందే మహేష్ తో ఆగడు సినిమా చేసిన తమన్నా ఆ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఫెయిల్యూర్ గా నిలవడంతో మరోసారి మహేష్ తో నటించాలని చూస్తున్న తమన్నాకు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఇంట్రో సాంగ్ లో నటించాలని ప్రపోజల్ రావడంతో ఏమాత్రం ఆలోచన లేకుండా ఉందట.. మీడియా లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.