సుకుమార్ అసిస్టెంట్ కొత్త స్టోరీ – మెగా హీరో కి నచ్చిందట టాలీవుడ్ టాక్

సుకుమార్ అసిస్టెంట్ కొత్త స్టోరీ - మెగా హీరో కి నచ్చిందట టాలీవుడ్ టాక్

0
457

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు, తాజాగా ఆయన పుష్ప సినిమా చేస్తున్నారు, బన్నీ ఈ సినిమాలో నటిస్తున్నారు, ఇక ఆయన దగ్గర వర్క్ చేయాలి అని చాలా మంది యువ దర్శకుల కల.. ఎందుకు అంటే ఆయన స్టోరీ రైటింగ్ ఇలా అనేక విషయాల్లో చాలా షార్ప్ గా ఆలోచన ఉంటుంది… మంచి బలమైన కథనంతో ప్రజల్లోకి వస్తారు.

అయితే ఆయన దగ్గర అసిస్టెంట్స్ గా పని చేస్తున్న రైటర్స్ డైరెక్టర్స్ వారిలో ఒక్కొక్కరు తమ టాలెంట్ను నిరూపించుకుంటున్నారు.. ఇటీవల ఉప్పెన సినిమాతో బుచ్చిబాబుసాన మంచి ఫేమ్ పొందారు.. అంతేకాదు పలువురు అగ్ర హీరోలు కూడా సినిమాలు చేయాలి అని ఆఫర్లు ఇస్తున్నారు.

తాజాగా సుకుమార్ అసోసియేట్ కార్తీక్ వర్మ దండు ఇటీవల సాయిధరమ్తేజ్ తో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఇక సుకుమార్ మరో అసిస్టెంట్ జయంత్ సిద్దం చేసిన స్క్రిప్ట్ సాయిధరమ్కు బాగా నచ్చిందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి..మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.