హీరోయిన్ సింధు మీనన్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా

Do you know heroine Sindhu Menon what is doing now?

0
317

టాలీవుడ్ లో తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది సింధూ మీనన్ మరి ఆమెకి తెలుగులో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. సింధు మీనన్ కర్ణాటకలో పుట్టి పెరిగింది. అయితే ఆమె మలయాళీ ఫ్యామిలీకి చెందినవారు. 1994 లో రష్మీ అనే కన్నడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చింది సింధు మీనన్..

హీరోయిన్గా అన్ని భాషల్లో కలిపి దాదాపు నలభై సినిమాల్లో నటించింది. 2001లో టాలీవుడ్కు భద్రాచలం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు. ఆ తర్వాత చందమామ సినిమాలో నటించిన ఈ భామ తన అందం, అభినయంతో అభిమానులని సంపాదించుకుంది.

డొమినిక్ ప్రభు అనే తెలుగు అబ్బాయిని 2010లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2012లో సుభద్ర అనే తెలుగు సినిమా చేసిన అనంతరం నటనకు గుడ్ బై చెప్పింది. కుటుంబంతో కలిసి లండన్ లో ఉంటుంది. ఈ జంటకి ఓ బాబు ఓ పాప ఉన్నారు. ఆమె ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.