ప్రభాస్ సినిమా కోసం ఆ సంస్ధ 100 కోట్ల ఆఫర్ ?

100 crore offer for Prabhas film ?

0
113

దేశంలో రికార్డ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే కరోనా పరిస్దితులు కాస్త చక్కపడ్డాక ఈ సినిమా విడుదల చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం సలార్ సినిమా కూడా సెట్స్ పై ఉంది. అయితే కరోనా వల్ల షూటింగుకి గ్యాప్ ఇచ్చారు.

ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమా విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ సలార్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోంది ఈ చిత్రం. ఇక ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ముఖ్యంగా ఫిలిం నగర్ లో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు .ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు తెగ పోటి పడిపోతున్నాయట. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 100 కోట్ల మార్క్ మాత్రం తగ్గకుండా ఆఫర్ వస్తోందట. దీని గురించి టాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకా మేకర్స్ మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారట.