Flash news: స్టార్​ హీరోయిన్ పై 2.5 కోట్ల చీటింగ్ కేసు నమోదు..

0
89

అమీషా పటేల్ వరుసగా హిందీ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ‘బద్రి’, ‘నాని’ వంటి సినిమాలతో తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో గుర్తింపు పొందింది నటి అమీషా పటేల్. తాజాగా ఈ బ్యూటీ చిక్కుల్లో పడ్డారు.

పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి టాలీవుడ్ స్టార్ల పక్కన నటించిన ఈ హీరోయిన్ పై జార్ఖండ్‌లో ఓ చీటింగ్ కేసు నమోదైంది. కారణం ఏంటంటే..అజయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత ‘దేశీ మ్యాజిక్’ అనే సినిమా చేయడానికి ఆమీషా బ్యాంకు ఖాతాకి రూ.2.5 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశానని.. కానీ ఆ డబ్బును అమీషా తిరిగి ఇవ్వలేదని నిర్మాత ఫిర్యాదు మేరకు అమీషాపై మోసం, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద సమన్లు ​​జారీ చేసింది.