20 కోట్లు కట్టిన రామ్ చరణ్

20 కోట్లు కట్టిన రామ్ చరణ్

0
91

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన చిత్రం సైరా, ఈ సినిమా మంచి హిట్ సంపాదించి పెట్టింది. అలాగే రికార్డుల విషయంలో చిరంజీవి సినిమా గత రికార్డులను చెరిపేసింది.. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త బయటకు వస్తోంది.

సైరా సినిమాకు జీఎస్టీ రూపంలో భారీ షాక్ తగిలింది. ముందు నుంచి ఈ సినిమా పై హోప్స్ పెట్టుకున్నారు అందరూ, స్వాతంత్ర్య సమరయోధుడి గాధతో తెరకెక్కించిన ఈ సినిమాకు నిజానికి ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఉంటుందని భావించారు. అయితే, ఈ విషయంలో మెగా ఫ్యామిలీకి నిరాశ ఎదురైంది. దీంతో జీఎస్టీ రూపంలో భారీగా నిర్మాత చరణ్ డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.

దాదాపు ఈ సినిమాకు జీఎస్టీ రూపంలో రాంచరణ్ ఏకంగా రూ. 20 కోట్ల వరకు చెల్లించినట్టు టాలీవుడ్ టాక్. మొత్తానికి ఆ డబ్బులు చెల్లించకపోతే అది కూడా లాభంలో చరణ్ కు వచ్చేది అంటున్నారు.. అయితే ఇలాంటి సినిమాలు తీసిన సమయంలో ప్రభుత్వాలు కూడా కాస్త ఆలోచించాలి అని చెబుతున్నారు టాలీవుడ్ అగ్రనిర్మాతలు, దర్శకులు.